టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈక్రేజ్ తో ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో అలరించడానికి వస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా వస్తుండగా.. ఈసినిమాలో నిఖిల్ వారియర్ గా కనిపించనున్నాడు. దీనికోసం నిఖిల్ ఇప్పటికే మేకోవర్ పూర్తిగా మార్చేశాడు. యుద్ద విద్యల్లో శిక్షణ కోసం తీసుకున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు నిఖిల్ పుట్టినరోజు కావడంతో ఈసినిమా నుండి పలు డేట్లు అయితే వచ్చాయి. ఇప్పటికే నిఖిల్ బర్త్ డే పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ జాయిన్ అయినట్టు వీడియో పోస్ట్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ ఈసినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా పనిచేయగా.. సెంథిల్ కుమార్ కూడా పనిచేయనున్నారు.
It's an Honour to be Working with The Technician who has Made India Proud..
The Eye behind several Masterpieces like RRR & BAAHUBALI.. Senthil Kumar garu.. Weaving his Camera Magic for #SWAYAMBHU
🙏🏽 privilege working with you sir @DOPSenthilKumar @iamsamyuktha_ @TagoreMadhu… pic.twitter.com/BsQ17G1aYw— Nikhil Siddhartha (@actor_Nikhil) June 1, 2024
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నభ నటేష్ కూడా మరో కీలక పాత్రలో చేయనుంది. ఈసినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి అందిస్తుండగా. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఎం.ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగరి డైలాగ్స్ అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























