హరి హర వీరమల్లు- పవన్ జాయిన్ అయ్యేది అప్పుడే

pawan kalyan hari hara veera mallu movie shooting update

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొదటిసారి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ లో పవన్ నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టారు ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ పెండింగ్ లో పడింది. షూటింగ్ దాదాపు పూర్తయిందని.. ఇంకా 25శాతం మాత్రమే మిగిలి ఉందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. పవన్ కళ్యాణ్ పోర్షన్స్ తో పాటు కొన్ని సన్నివేశాలు ఈనేపథ్యంలోనే ఈసినిమా షూటింగ్ కు సంబంధించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. జూన్ 15వ తేదీ నుండి ఈసినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టాలని చూస్తున్నారట. అంతేకాదు షూటింగ్ మొదలైన వారం రోజుల తరువాత పవన్ కూడా షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ నుండి అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.