టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ ఒక్క సినీ ఇండస్ట్రీ అని కాదు..అన్ని సినీ ఇండస్ట్రీల్లోనూ బయోపిక్ ల హవా సాగుతుంది. పొలిటికల్ నేపథ్యంలో తెలుగులో ఎన్టీఆర్ మహానాయకుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు మరికొంతమంది బయోపిక్ లు తెరకెక్కాయి.. రిలీజ్ కూడా అయ్యాయి. తమిళంలో జయలలిత బయోపిక్ కూడా వచ్చింది. ఆతరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ కూడా వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా మరో మోడీ బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉండగా ఈ మోడీ బయోపిక్ లో సత్యరాజ్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే కదా. అయితే ఈవార్తలపై సత్యరాజ్ కూడా ఇటీవల స్పందించి ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. తను ఎలాంటి బయోపిక్ లో నటించడంలేదని క్లారిటీ ఇచ్చాడు. ఇక తాజాగా మరోసారి ఈ బయోపిక్ పై స్పందించారు సత్యరాజ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యరాజ్.. మోదీ పాత్రలో నటించడానికి నన్ను ఎవరూ సంప్రదించలేదు. నిజంను నిజాయితీగా చూపించే నా మిత్రుడు దివంగత దర్శకుడు మణివణ్ణన్ మోడీ బయోపిక్‌కు దర్శకత్వం వహించినట్లయితే నేను ఈ సినిమాలో నటించే వాడినేమో.. ఇప్పుడు అతను లేడు కాబట్టి వెట్రి మారన్, పా.రంజిత్, సెల్వరాజ్ లాంటి దర్శకులు ఈ బయోపిక్‌కి దర్శకత్వం వహిస్తే ఇందులో నటిస్తా అంటూ సత్యరాజ్ చమత్కరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























