అఫీషియల్.. ఆగిపోయిన ప్ర‌శాంత్ వ‌ర్మ – రణ్‌వీర్‌సింగ్‌ కాంబో ప్రాజెక్ట్

Prasanth Varma and Ranveer Singh's Rakshas Movie Shelved

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వర్మ‌ ‘హ‌నుమాన్‌’ సినిమాతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా 330 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి ఔరా అనిపించింది. దీంతో ప్ర‌శాంత్ వ‌ర్మ‌ పేరు అంతటా మారుమ్రోగిపోయింది. ఈ క్రమంలో అయనకు టాలీవుడ్ నుండే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌వీర్‌సింగ్‌ ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో కలిసి ఓ సినిమా చేయడానికి అంగీకరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకొచ్చింది. మైథ‌లాజిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు ‘రాక్షస్’ అని టైటిల్ కూడా ఖరారు చేశారు. పాన్ ఇండియ‌న్ లెవెల్లో ప్లాన్ చేసిన ఈ సినిమాను త్వ‌ర‌లో అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతవరకూ బాగానే నడిచింది. అయితే అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ మేర‌కు మైత్రీ మూవీ మేక‌ర్స్ గురువారం సోషల్ మీడియా వేదికగా ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల‌ చేసింది. ర‌ణ్‌వీర్‌సింగ్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ ఇద్ద‌రి మ్యూచ‌వల్ అండ‌ర్‌స్టాండింగ్‌తోనే ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేసినట్లు స్పష్టం చేసింది.

అలాగే ‘రాక్ష‌స్’ మూవీ చేయ‌డం లేద‌ని ర‌ణ్‌వీర్‌సింగ్‌తో పాటు ప్ర‌శాంత్ వ‌ర్మ కూడా అధికారికంగా వెల్ల‌డించారు. ప్ర‌శాంత్ వ‌ర్మ అద్భుత‌మైన ట్యాలెంట్ ఉన్న ద‌ర్శ‌కుడని పేర్కొన్న ర‌ణ్‌వీర్‌సింగ్‌.. ఇద్దరం క‌లిసి ఓ మంచి సినిమా చేయాల‌ని అనుకున్నామని, అయితే స‌రైన క‌థ కుద‌ర‌లేదని తెలిపారు. భవిష్యత్తులో మంచి క‌థ దొరికితే త‌ప్ప‌కుండా ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుందని చెప్పారు. మరోవైపు దీనిపై ప్ర‌శాంత్ వ‌ర్మ స్పందిస్తూ.. ర‌ణ్‌వీర్‌సింగ్‌ టాలెంట్‌, ఎన‌ర్జీ అసామాన్యం. ఆయనలాంటి న‌టుడితో భ‌విష్య‌త్తులో త‌ప్ప‌కుండా సినిమా చేస్తాన‌ని అన్నారు. కాగా ఈ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇదిలావుంటే.. ప్ర‌శాంత్ వ‌ర్మ‌ ప్ర‌స్తుతం ‘హ‌నుమాన్‌’ సీక్వెల్‌ ‘జై హ‌నుమాన్’ సినిమాను తెర‌కెక్కిస్తోన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జోరుగా కొనసాగుతున్నాయి. హ‌నుమాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డ నేపథ్యంలో ‘జై హ‌నుమాన్’ను మరింత విజువల్ వండర్‌గా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక ఇందులో హ‌నుమాన్‍గా ఓ స్టార్ హీరో న‌టించ‌నున్నారని, ప్రస్తుతానికి అది సస్పెన్స్ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇదివరకే ప్రకటించారు. దీంతో ఈ సీక్వెల్‌పై మరింత హైప్ క్రియేట్ అయింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.