మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా విశ్వంభర. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్సే సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. తన ఇన్ట్సా ద్వారా తాను ఇంకా అజిత్ ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. విశ్వంభర సెట్ కు నిన్న అనుకోని అతిథి వచ్చారు. అతను ఎవరో కాదు అజిత్.. పక్క సెట్ లోనే షూటింగ్ జరుపుకుంటున్న అజిత్ నా దగ్గరకు వచ్చాడు.. కాసేపు మేమిద్దరం సరదాగా ముచ్చటించుకున్నాం.. అజిత్ తెలుగులో మొదటి సినిమా ప్రేమ పుస్తకం సమయంలో విషయాలు గుర్తుచేసుకున్నాం. ఆ సినిమా ఆడియో లాంచ్ నేనే చేశాను. అజిత్ భార్య షాలిని జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. ఆ జ్ఞాపకాలు అన్ని గుర్తుచేసుకున్నాము. అజిత్ ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ అదే మంచితనంతో ఉన్నాడు అని తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
View this post on Instagram
కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























