సంయుక్త మీనన్ బాలీవుడ్ డెబ్యూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

samyuktha menon bollywood debut maharagni movie glimpse released

మొదట చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చి లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సంయుక్త మీనన్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్..ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం సంయుక్త మీనన్ నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభూ సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీనితో పాటు సంయుక్త శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు సంయుక్త మీనన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రముఖ నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ నటులు కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తుంది. ఇక సినిమాలో సంయుక్త మీనన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. మహారాగ్ని అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా నుండి తాజాగా ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ చేస్తూ కట్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. సంయుక్త మీనన్ చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ప్రభువుదేవా, నజరుద్దీన్ షా పాత్రలు కూడా చేశారు. గ్లింప్స్ చివరిలో కాజోల్ ఎంట్రీ.. జాతరలో ఫైట్ చేసే సీన్, తాను చెప్పే డైలాగ్ గూజ్ బమ్స్ తెప్పిస్తున్నాయి.

ఇంకా ఈసినిమా నసీరుద్దీన్ షా, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ తదితరలు పలు కీలక పాత్రల్లో నటిస్తునారు. బవేజా స్టూడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈసినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.