దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయమైన హీరో ఆశిష్ రెడ్డి. రీసెంట్ గానే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చిన సినిమా లవ్ మీ. హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాపై రిలీజ్ కు ముందే ఎంతో క్యూరియాసిటీని పెంచింది. ఫైనల్ గా మే 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా టాక్ సంగతి పక్కన పెడితే కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకుపోతుంది. రోజు రోజుకీ కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. మొదటి రోజు 4 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకోగా రెండు రోజుల్లో 7 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా మూడో రోజుకు సంబంధించిన కలెక్షన్ల రిపోర్ట్ కూడా వచ్చేసింది. మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 9.03 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకున్నట్టు తెలిపారు.
#LoveMe – ‘𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆, with its unique plot, has set the box office on fire ❤🔥❤🔥
Grosses 9.03 CRORES worldwide in 3 days 💥💥
Book your tickets now and enjoy the #GhostLove 🤩
🎟️ https://t.co/r3FlBmrjpx#BlockbusterGhostLove💘@AshishVoffl @iamvaishnavi04… pic.twitter.com/xCGQrI1HAD— Dil Raju Productions (@DilRajuProdctns) May 28, 2024
కాగా ఈసినిమాలో బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా.. సిమ్రాన్ చౌదరి, రవి కృష్ణ, రాజీవ్ కనకాల, తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈసినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































