అల్లరి నరేష్ ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఒకే జోనర్ కు పరిమితమవ్వకుండా పలు జోనర్లు ట్రై చేయడానిక చూస్తున్నాడు. ఈమధ్య నాంది, ఉగ్రం, ఇట్లు మారేడుమిల్ల ప్రజానీకం అంటూ సీరియస్ పాత్రలు చేయగా సామిరంగ సినిమాలో మరోసారి గమ్యం సినిమాలోని తరహా పాత్రను చేశాడు. రీసెంట్ గా మళ్లీ తన కామెడీ యాంగిల్ ను బయటకు తీస్తూ ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో వచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సోలో బ్రతుకే సో బెటరు ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో నరేష్ హీరోగా వస్తున్న సినిమా బచ్చలమల్లి. 1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. అయితే ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా రోజులైన క్రమంలో తాజాగా చిత్రయూనిట్ ఒక అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. రేపు అంటే మే 28వ తేదీన మధ్యాహ్నం 12గంటల 6 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
బచ్చల మల్లి 🔥 pic.twitter.com/nElGqF9DBn
— Allari Naresh (@allarinaresh) May 27, 2024
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రావు రమేష్, హరితేజ, ప్రవీణ్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. మానాడు, రంగం, మట్టి కుస్తీ చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























