సమ్మర్ లో బాక్సాఫీస్ కాస్త వెలవెలబోయింది అని చెప్పొచ్చు. ఎప్పుడూ సమ్మర్ కు పలు సినిమాలు రిలీజ్ అయి సందడి చేస్తాయి. కానీ ఈ ఏడాది మాత్రం పెద్దగా సినిమాలు ఏం రిలీజ్ కాలేదు. ఈనేపథ్యంలో తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా లవ్ మీ. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చిన సినిమా లవ్ మీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా మే 25వ తేదీన రిలీజ్ చేశారు. హార్రర్ నేపథ్యంలో దయ్యంతో హీరో ప్రేమలో పడే ఆసక్తికర కథాంశంతో వచ్చిన ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా ఈసినిమా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంది. మొదటి రోజు ఈసినిమా 4కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా రెండు రోజుల్లో ఈసినిమా 7 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుంది. చిన్న సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం విశేషమనే చెప్పాలి. మరీ ముందు ముందు కలెక్షన్లు పరంగా ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాల్సిందే.
#LoveMe – ‘𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆 is going strong at the box office ❤🔥❤🔥
Collects a worldwide gross of 7.35 CRORES in 2 days 💥💥
Book your tickets now to witness #GhostLove on the big screens 🤩
🎟️ https://t.co/r3FlBmrjpx#BlockbusterGhostLove💘@AshishVoffl… pic.twitter.com/L7Mujhe4I7— Dil Raju Productions (@DilRajuProdctns) May 27, 2024
కాగా ఈసినిమాలో బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా.. సిమ్రాన్ చౌదరి, రవి కృష్ణ, రాజీవ్ కనకాల, తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈసినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































