మనమే- మెలోడియస్ ఓ మనమే ఫుల్ సాంగ్ రిలీజ్

oh manamey full song out from manamey movie

కొంచం గ్యాప్ తరువాత ప్రామిసింగ్ హీరో శర్వానంద్ నుండి వస్తున్న సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా ఈసినిమా రాబోతుంది. కొంత కాలంగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలతో అలరిస్తున్న శర్వా ఈసినిమాలో ప్లే బాయ్ తరహా ఎనర్జిటిక్ రోల్ లో కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, అలానే రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు రెండో పాటకు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చేశారు మేకర్స్. ఓ మనమే అంటూ వచ్చే సెకండ్ సాంగ్ ప్రోమో ను నేడు ఉదయం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మెలోడీ గా ఉన్న ఈ పాట అయితే ఆకట్టుకుంటుంది. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించిన ఈ పాటను కార్తీక్ ఇంకా గీతా మాధురి పాడారు.

కాగా ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.