రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మరొక హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. వైజయంతి మూవీస్ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, స్పెషల్ వీడియోస్ అన్నీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. జూన్ 27వ తేదీన ‘కల్కి 2898 AD’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కస్టమ్-మేడ్ వాహనాన్ని విడుదల చేయడానికి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన ‘బుజ్జి’ని ప్రపంచానికి పరిచయం చేయడానికి దాదాపు 1 నిమిషం నిడివి గల టీజర్‌ను కూడా విడుదల చేశారు.
ఇక తమ అభిమాన హీరోని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈవెంట్‌లో భాగంగా ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా ఈవెంట్ కి ఎంట్రీ ఇచ్చాడు. బుజ్జి మీద వేదిక మీదకు వచ్చిన ఆయన ప్రభాస్ డాషింగ్ గా కనిపించాడు. తన డేర్-డెవిల్ స్టంట్ లతో డార్లింగ్ అబ్బురపరిచారు. తాను బుజ్జిని నడిపిన తీరు చూస్తే ఆ కారుతో తనకి ఉన్న అనుబంధం అర్ధం అవుతుంది. భైరవ గెటప్ లో వేదిక మీదకు ప్రవేశించిన ప్రభాస్ సినిమా తీయడానికి పడిన కష్టాన్ని వెల్లదించారు. దీనికి సహకరించిన తన మేకర్స్‌పై ఆయన ప్రశంసలు కురిపించాడు. అలాగే ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినందుకు జాతీయ మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ప్రభాస్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























