స్వాగ్ ఎగ్జైటింగ్ అప్ డేట్లు ఆన్ ది వే

sree vishnu swag movie exciting updates on the way

డిఫరెంట్ సినిమాలు తీయడంలో శ్రీ విష్ణు ఎప్పుడూ ముందుంటాడు. గత ఏడాది సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది ఓం భీమ్ బుష్ సినిమాతో సెకండా హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్లను ను అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్‌ కానీ పోస్టర్లు మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. మూవీ నుంచి ఎగ్జైటింగ్ అప్‌డేట్‌లు త్వ‌ర‌లోనే ఇవ్వ‌బోతున్న‌ట్లు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు. హసిత్ గోలితో శ్రీవిష్ణు చేస్తున్న రెండో సినిమా ఇది. ఇక రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. జూలై ఫస్ట్ వీక్ లో ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.