ఇండియన్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

indian 2 movie first single paaraa song promo out now

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు మేకర్స్. జులై 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ఇప్పటికే చిత్రయూనిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. పారా అంటూ వచ్చే ఫస్ట్ సింగిల్ ను మే 22 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈలోపు ఈ పాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. రాక్‌స్టార్ అనిరుధ్‌ రవిచందర్‌ కంపోజ్‌ చేసిన ఈపాట ప్రోమోనే ఆకట్టుకుంటుంది. మరి ఫుల్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌, సుభాస్కరన్‌ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.