గత కొంతకాలంగా పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇదేక్రమంలో సినిమా రంగంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. సినిమాకు మూలాధారమైన నిర్మాణ రంగంలోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. అలాగే గతంలోనూ, ప్రస్తుతం మహిళలే ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన సినిమాలు కూడా అనేకం ఉన్నాయి. మరోవైపు ప్రేక్షకుల ఆలోచనా ధోరణిలో కూడా ఇటీవలి కాలంలో మార్పు వచ్చింది. ఈ క్రమంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కించడంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో సమాజంలో మహిళల ప్రాముఖ్యతను నొక్కిచెప్పే బలమైన మహిళా ప్రధాన పాత్రలతో అనేక తెలుగు చిత్రాలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్లో వచ్చిన బెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీస్
1. అనుకోకుండా ఒక రోజు (2005): ఛార్మి ప్రధానపాత్రలో కనిపించగా.. జగపతి బాబు, శశాంక్ కీలక పాత్రలు పోషించారు.
2. అనసూయ (2007): భూమిక ప్రధానపాత్రలో కనిపించగా.. రవిబాబు, అబ్బాస్ కీలక పాత్రలు పోషించారు.
3. అరుంధతి (2009): అనుష్క ముఖ్యపాత్రలో కనిపించగా.. సత్యనారాయణ, సోనూసూద్, మనోరమ కీలక పాత్రలు పోషించారు.
4. గీతాంజలి (2014): అంజలి లీడ్ రోల్ ప్లే చేయగా.. శ్రీనివాసరెడ్డి, రావు రమేష్ ఇతర పాత్రల్లో కనిపించారు.
5. రుద్రమదేవి (2015): కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి జీవితకథగా తెరకెక్కింది. అనుష్క టైటిల్ రోల్లో కనిపించగా.. అల్లు అర్జున్, రానా దగ్గుబాటి ముఖ్య పాత్రలు పోషించారు.
6. మహానటి (2018): అలనాటి అగ్రతార సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కింది. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించగా.. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ కీలక పాత్రల్లో కనిపించారు.
7. భాగమతి (2018): అనుష్క కథానాయికగా నటించగా.. ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, జయరామ్ ఇతర పాత్రలు పోషించారు.
8. ఓ బేబీ (2019): స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటించగా.. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, ప్రగతి, తేజ సజ్జా ముఖ్య పాత్రల్లో కనిపించారు.
9. యశోద (2022): సమంత హీరోయిన్గా.. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.
10. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (2023): అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన ఈ సినిమా కథ ఎక్కువభాగం కథానాయిక చుట్టూ తిరుగుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































