యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవర. సముద్రం బ్యాక్డ్రాప్లో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రాబోతుంది. రెండు పార్ట్ లుగా ఈసినిమా రాబోతున్న నేపథ్యంలో అక్టోబర్ 10వ తేదీన ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఫైనల్ గా ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న దేవర ఫియర్ సాంగ్ అయితే వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు కు ఒకరోజు ముందే ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫియర్ సాంగ్ ను అయితే రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ పాట రిలీజ్ అయింది. 3 నిమిషాల 16 సెకన్ల నిడివితో ఉన్న ఈ సాంగ్ అయితే గూజ్ బంప్స్ తెచ్చేలా ఉంది. ఎన్టీఆర్ రెగ్యులర్ సినిమాల సాంగ్స్ కంటే భిన్నంగా ఈసాంగ్ ఉంది. ఆగ్గట్టుకుంది సంద్రం.. భగ్గునమండే ఆకాశం అంటూ వచ్చే ఈ పాటను స్వయంగా అనిరుధ్ రవిచందర్ పాడగా.. తెలుగులో ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. తెలుగు, తమిళం, హిందీలో అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. కన్నడ, మలయాళంలో సంతోష్ వెంకీ పాడారు.
The arrival of the Man of Masses @tarak9999 is creating ripples everywhere with thunderous applause 😎❤️🔥
Join his majestic journey through a BLASTING #FearSong 💥💥
An @anirudhofficial Musical 🎶#Devara #DevaraFirstSingle #KoratalaSiva @ramjowrites pic.twitter.com/1CXzQX48fu
— Devara (@DevaraMovie) May 19, 2024
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























