ముకుంద సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. మొదట వరుస ఫ్లాప్స్ అందుకున్నా ఆ తరువాత మాత్రం సూపర్ హిట్లతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. వరుసగా స్టార్ హీరోలతో తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయింది. గత రెండేళ్ల క్రితం దేశంలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే ఆ లిస్ట్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే ముందు ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు పూజా హెగ్డే జోరు కాస్త తగ్గింది. తెలుగు అయితే ప్రస్తుతానికి కొత్త సినిమా ఏంలేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా పూజా హెగ్డే ఒక బంపరాఫర్ కొట్టేసినట్టు తెలుస్తుంది. తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సూర్య కెరీర్ లో వస్తున్న 44వ సినిమా ఇది. ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సందర్భంగా పూజా హెగ్డే కూడా తన సోషల్ మీడియా ద్వారా ఈవిషయాన్ని తెలియచేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
కాగా మలయాళం నటుడు జోజు జార్జ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈసినిమాను స్టోన్ బెంచ్ ఫిల్మ్‌తో కలిసి సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీగా నిర్మిస్తుంది. సంతోష్‌నారాయణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
తమిళ్ స్టార్ హీరో సూర్య మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే సూర్య శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. బాబి డియోల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































