ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా భజే వాయి వేగం. నాన్న కోసం కొడుకు ఏంచేశాడు అనే నేపథ్యంతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించకుంటుంది. ఇక ఈసినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఫస్ట్ సింగిల్ సెట్ అయ్యిందే సాంగ్ ను రిలీజ్ చేయగా మాస్ బీట్ తో ఉన్న ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా ఓవర్సీస్ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. ఈసినిమా ఓవర్సీస్ రిలీజ్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలను అక్కడ రిలీజ్ చేసిన శ్లోకా ఎంటర్ టైన్ మెంట్స్ వారు ఈసినిమా రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారు.
కాాగా ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ హ్యాపీడేస్ రాహుల్ టైసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్, సంగీతం రధన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – కపిల్ కుమార్ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































