డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లలో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈసినిమా గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అందించడంతో సీక్వెల్ ను లైన్ లో పెట్టారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈమధ్య షూటింగ్ ఆగిపోయిందన్న వార్తలు వచ్చాయి. కానీ పూరీ రీసెంట్ గా నే షూటింగ్ అప్ డేట్ ఇచ్చి రూమర్లకు చెక్ పెట్టాడు. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్ లో ప్రధాన తారాగణంతో షూటింగ్ జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ను చిత్రయూనిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. మే 15వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు తాజాగా టీజర్ రన్ టైమ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. 85 సెకన్లు టీజర్ టైమ్ ను లాక్ చేశారు.
Get ready to celebrate the arrival of USTAAD #RAmPOthineni as #DoubleISMART 😎
2X dosage of MADNESS Loading in 85 SECONDS of 𝗱𝗶𝗠𝗔𝗔𝗞𝗜𝗞𝗜𝗥𝗜𝗞𝗜𝗥𝗜 #DoubleISMARTTeaser 💥
Releasing Tomorrow, MAY 15th ❤️🔥
ARE YOU READY 😎@ramsayz #PuriJagannadh @duttsanjay #ManiSharma… pic.twitter.com/IDO2xraB0h
— Puri Connects (@PuriConnects) May 14, 2024
కాగా ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. సినిమాటోగ్రఫీని శామ్ కె నాయుడు, జియాని జియానెలీ అందిస్తున్నారు. మణిశర్మనే డబుల్ ఇస్మార్ట్‌కు కూడా సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా ఈసినిమా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























