భగవంత్ కేసరి సినిమాతో గతేడాది మాసివ్ హిట్ అందుకుంది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. దీనితర్వాత ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘సత్యభామ’. లేడీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఆమె ఒక పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనుంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు “మేజర్” ఫేమ్ శశికిరణ్ టిక్క స్క్రీన్ ప్లే అందించడంతోపాటుగా సమర్పకులుగా కూడా వ్యవహరిస్తున్నాడు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి రెండు పాటలు మరియు గ్లింప్స్ కూడా సినీప్రియులను బాగా అలరించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి ‘వెతుకు వెతుకు’ అనే థర్డ్ సింగిల్‌ను మే 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ‘సత్యభామ’ ఈ నెల 17న విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























