నటీనటులు : సత్యదేవ్ ,అతిరా రాజ్ ,అర్చన అయ్యర్ ,లక్ష్మణ్ ఎడిటింగ్ :తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ : సూర్య కూరపాటి సంగీతం : కాల భైరవ దర్శకత్వం :గోపాల కృష్ణ నిర్మాత :కృష్ణ కొమ్మలపాటి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సహజ నటుడు గా పేరు తెచ్చుకున్న యాక్టర్ సత్యదేవ్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ.ఈసినిమాకు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరించడం అలాగే ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమా చూడాలని ఆసక్తి క్రియేట్ అయ్యింది.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.మరి కృష్ణమ్మ ఎలా వుంది? అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.
కథ :
ముగ్గురు అనాథలైన భద్ర (సత్యదేవ్),శివ, కోటి బెస్ట్ ఫ్రెండ్స్. వీరిలో భద్ర, కోటి విశాఖ పట్నంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తారు.ఇదిలావుండగా మరో స్నేహితుడు శివ లైఫ్ లోకి లైఫ్ లోకి ఓ అమ్మాయి వస్తుంది.ఆ తరువాత వారిద్దరూ ప్రేమలో పడతారు అయితే ఈ ముగ్గురు స్నేహితులు వాళ్లకు సంబంధం లేని కేసు విషయంలో అరెస్టు అవుతారు. ఆతరువాత ఏమైంది ? అసలు ఎందుకు అరెస్ట్ కావల్సి వస్తుంది?ఇంతకీ ఆ కేసు ఏంటి ? చివరికి ఆ కేసు నుండి బయటపడ్డారా లేదా అనేదే కృష్ణమ్మ కథ.
విశ్లేషణ :
చెయ్యని తప్పుకు జైలు శిక్ష అనుభవించడం ఆ తరువాత ఆ కేసులో నుండి బయటపటడం ఇలాంటి స్టోరీ లతో ఇంతకుముందు కూడా సినిమాలు వచ్చాయి అయితే కృష్ణమ్మ మాత్రం కాస్త కొత్తగా అనిపిస్తుంది.కథలో వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు.ఇక్కడ కొంచెం బోర్ కలిగించిన సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా ఉండి శాటిస్ఫై చేస్తుంది.
ముఖ్యంగా సినిమాను తెరకెక్కించిన విధానం మెప్పిస్తుంది.అనవసరమైన కమర్షియల్ ఆర్బాటం లేకుండా రియల్ లొకేషన్లలో సహజంగా తెరకెక్కించడం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. రా ట్రీట్మెంట్ కూడా మెప్పిస్తుంది. ముఖ్యంగా క్యాస్టింగ్ సినిమాకు ప్లస్ అయ్యింది.సెకండ్ హాఫ్ లో కేసు లో అరెస్టయిన తరువాత అక్కడి నుండి ఉత్కంఠగా సాగుతుంది.అమాయకులను కేసులో ఇరికించడానికి పోలీసులు చేసే ప్రయత్నాలు బయపెట్టిస్తాయి.ఆ కేసు పూర్వపరాలు కదిలిస్తాయి.క్లైమ్యాక్స్ చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే సినిమాను తన భుజాలపై మోశాడు సత్యదేవ్. భద్ర పాత్రలో ఇంటెన్సివ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు.సత్యదేవ్ విజయవాడ స్లాంగ్ కూడా బాగుంది. ఫ్రెండ్స్ పాత్రల్లో నటించిన లక్ష్మణ్, కృష్ణ కూడా అదరగొట్టారు.వారికి కు చాలా మంచి పాత్రలు దొరికాయి.వీరితో పాటు కీలక పాత్రలో నటించిన అతిరా రాజ్ తెర మీద చాలా సహజంగా కనిపించింది. మిగితా పాత్రల్లో నటించిన అర్చన అయ్యర్ ,రఘు కుంచె వారి పాత్రలకు తగ్గట్లు నటించారు.
టెక్నీకల్ కూడా సినిమా ఉన్నతంగా వుంది.సాంగ్స్ గుర్తుపెట్టుకునేలా లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మ్యాజిక్ చేశాడు కాల భైరవ.సినిమాటోగ్రఫీ బాగుంది.విజువల్స్ సహజంగా అనిపించాయి. షార్ప్ ఎడిటింగ్ సినిమాకు కలిసొచ్చింది.నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు వున్నాయి.
ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన సత్యదేవ్ కృష్ణమ్మ ఆ అంచనాలను అందుకుందని చెప్పొచ్చు.సత్యదేవ్ నటన ,సెకండ్ హాఫ్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్ అయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి ఈసినిమా బాగా నచ్చుతుంది. మిగితావారు కూడా ఓ సారి చూసేయెచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























