జై సినిమాతో హీరో గా తెలుగు తెరకు పరిచయమై ఆతర్వాత హీరో కాకుండా పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్. గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నవదీప్ ఇప్పుడ మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా వస్తున్న సినిమా లవ్ మౌళి. ఈసినిమాలో నవదీప్ఇంతకుముందు ఎన్నడూ కనిపించని లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సింది. ఏప్రిల్ 19వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేద్దామనకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నామని తెలిపారు మేకర్స్. అయితే ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. ఈసినిమాను జూన్ 7వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఈసినిమాకు సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బృందం ఈసినిమా ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
Censor done and ready for the cinemas! 🔥🔥
Love, Mouli
Releasing on 7th June! @pnavdeep26 @pankhurigidwan1 @Love_Avaneendra #GovindVasantha @IananthaSriram #AnishKrishnan @cspaceg @NyraCreations @thaikudambridge @adityamusic pic.twitter.com/1AwNvRqebA— Navdeep (@pnavdeep26) May 9, 2024
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా పంఖురి గిద్వానీ నటిస్తుంది. నైరా క్రియేషన్స్, సి స్పేస్ గ్లోబల్ బ్యానర్స్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత ఈసినిమాకు సంగీతం అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























