పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది అని చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఈసినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఓటీటీ లో మాత్రం ఊహించని విధంగా ఈసినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఓటీటీలో చూసిన వారు సినిమాపై స్పందించి సినిమా బాగానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఓటీటీలో రిలీజ్ అయి దాదాపు 10 రోజులు అవుతున్నా కూడా ఇంకా టాప్ ప్లేస్లో కొనసాగుతూ ట్రెండింగ్లో నిలుస్తోంది. మొత్తానికి థియేటర్లలో దెబ్బ కొట్టిన ఈసినిమా ఓటీటీలో దూసుకుపోవడం మాత్రం గొప్ప విషయమనే చెప్పాలి.
కాగా ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చింది. ఈ సినిమాలో గోవర్ధన్ అనే మిడిల్ క్లాస్ యువకుడిగా విజయ్ దేవరకొండ కనిపించాడు. అతని జీవితంలోకి ఇందు ఎలా వచ్చింది? ఇందును ప్రేమించిన గోవర్ధన్ ఆమెకు ఎందుకు బ్రేకప్ చెప్పాడు? జాబ్ కోసం గోవర్ధన్ అమెరికా వెళ్లగా అతడి వెంట ఇందు ఎందుకు వచ్చింది? చివరికి గోవర్ధన్, ఇందు ఎలా ఒక్కటయ్యారు అనేదే ఈసినిమా కథ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























