తెలుగు అమ్మాయి అంజలి టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. ‘ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి’ అంటూ వస్తోన్న ఈ మూవీ అంజలి నటించిన 50వ సినిమా కావడం విశేషం. ‘నిన్ను కోరి’, ‘నిశ్శబ్దం’ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన శివ తుర్లపాటి ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై నిర్మాతలు ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ నేపథ్యంలో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఏప్రిల్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నైజాం ఏరియాలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేశారు. ఇదిలావుండగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా కేవలం 11 రోజుల్లో 20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
Hilarious Summer Blockbuster #GeethanjaliMalliVachindhi collects 20Cr Gross in just 11 days 🔥
Book Your Tickets Now – https://t.co/CXU74EyXcD#Anjali50 #BlockbusterGMV@yoursanjali @konavenkat99 @MP_MvvOfficial #GV #ShivaTurlapati @Konafilmcorp @MVVCinema_ @Mangomusiclabel… pic.twitter.com/49LmnUTMwt
— Telugu FilmNagar (@telugufilmnagar) April 22, 2024
కామెడీ అండ్ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు రాహుల్ మాధవ్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఇక ఈ సినిమాలో లో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ, సునీల్, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, రవిశంకర్, ప్రియ, ముక్కు అవినాష్, విరుపాక్ష రవి, రాహుల్ మాధవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























