విక్ర‌మ్ వీర ధీర శూరన్ టీజర్ హైలైట్స్..!

Chiyaan Vikram's Veera Dheera Sooran Teaser Released

విలక్ష‌ణ‌మైన సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టమే కాకుండా జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ చియాన్ విక్ర‌మ్‌. బుధ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. చియాన్ నటిస్తున్న 62వ చిత్రానికి ‘వీర ధీర శూరన్ 2’ అనే టైటిల్‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. త్వ‌ర‌లోనే తెలుగు టైటిల్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎస్‌.జె.సూర్య‌, దుషారా విజ‌య‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.యు. అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ‘వీర ధీర శూరన్ 2’లో ప‌క్కా మాస్ అవ‌తార్‌లో చియాన్ విక్ర‌మ్ అభిమానుల‌ను మెప్పించ‌టం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇక నిన్న విడుదలైన ఈ మూవీ టీజర్ చియాన్ అభిమానులతోపాటు మూవీ లవర్చ్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. ‘వీర ధీర శూరన్ 2’ టీజర్ హైలైట్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.

టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. హీరో పేరు కాళి. త‌న‌కు ఓ కిరాణా షాప్ ఉంటుంది. అందులో త‌ను ప‌ని చేసుకుంటుంటాడు. అత‌నితో అంత‌కు ముందే దెబ్బ‌లు తిన్న విల‌న్స్ జీపులు, వ్యాన్స్ వేసుకుని అక్క‌డికి చేరుకుంటారు. త‌మ‌ను కొట్టింది కిరాణా షాప్‌లో ఉన్న హీరో అని క‌న్‌ఫ‌ర్మ్ అయితే అత‌న్ని చంపేయాల‌నేది వారి ఆలోచ‌న‌.. అయితే విల‌న్స్ జాడ‌ను హీరో ప‌సిగ‌ట్టేస్తాడు. అక్క‌డ ప‌ని చేసుకుంటూనే విల‌న్స్‌ను ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాడు.

త‌మ‌ను కొట్టింది హీరో అని తెలియ‌గానే విల‌న్స్ క‌త్తులు తీసుకుని దాడి చేయ‌టానికి వస్తుంటారు. అంతే.. మ‌న క‌థానాయ‌కుడు అప్ప‌టి వ‌ర‌కు దాచి పెట్టిన తుపాకీ తీసుకుని ఓ విల‌న్ చెవికి గాయ‌మ‌య్యేట‌ట్లు కాల్చ‌డంలో దుండ‌గులు భ‌యంతో ప‌రుగులు తీస్తారు. షాప్‌లో ఉన్న క‌స్ట‌మ‌ర్ హీరో చేతిలోని గ‌న్ చూసి భ‌య‌ప‌డుతుంది. కానీ హీరో అదేమీ ప‌ట్టించుకోకుండా ఆమె కొన్న స‌రుకుల ఖ‌ర్చు ఎంత‌య్యిందనే విష‌యాన్ని చెప్ప‌టంతో షాపులోని లేడీ క‌స్ట‌మ‌ర్‌, ఓ ప‌క్క భ‌యం, మ‌రో ప‌క్క ఆశ్చ‌ర్యంతో నోరు వెల్ల‌బెట్టేస్తుంది.

225 సెక‌న్ల పాటుండే ‘వీర ధీర శూరన్ 2’ టైటిల్ టీజ‌ర్‌లోనే అంత మాస్ ఎలిమెంట్స్ ఉన్న‌ప్పుడు సినిమాలో ఇక ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక చియాన్ విక్ర‌మ్ మాస్ అవ‌తార్ కెవ్వు కేక అనిపించ‌టం ప‌క్కా అని తెలుస్తుంది. జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.