బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ నెట్ ఫ్లిక్స్ లో సరికొత్త రికార్డు సృష్టించింది.కేవలం రెండు వారాల్లోనే 12.24 మిలియన్ల వ్యూయర్ షిప్ తో అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన మొదటి బాలీవుడ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.ఇంతకుముందు యానిమల్,డంకి సినిమాలు ఈ జాబితాలో మొదటి,రెండు స్థానాల్లో ఉండేవి ఇప్పుడు ఫైటర్ ఆ రికార్డు బ్రేక్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జనవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా 200కోట్లకు పైగా వసూళ్లను సాధించి హిట్ అనిపించుకుంది.సిద్దార్ట్ ఆనంద్ డైరెక్ట్ చేయగా కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది.అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించాడు.ఏవియేషన్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈసినిమాకు విశాల్-శేఖర్ సంగీతం అందించగా వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించింది.
ఇక ఫైటర్ తర్వాత హృతిక్ రోషన్ వార్ 2 లో నటించనున్నాడు.ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటించనున్నాడని తెలిసిందే.బ్రహ్మస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించనుంది.ఈనెలలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























