ఈమధ్య నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూషన్ వైపు కూడా మొగ్గుచూపుతున్నాయి. సినిమాను తాము నిర్మించకపోయినా రిలీజ్ చేయడానికి మాత్రం ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా ఈ పంథాలోకి వచ్చాయి. అందులో మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఒకటి. ఒకపక్క సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ లో కూడా తన సత్తా చాటుతుంది అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈమధ్య కాలంలో సలార్, హనుమాన్ సినిమాల నైజాం హక్కులను సొంతం చేసుకొని అక్కడ రిలీజ్ చేయగా ఆ సినిమా ఎంత లాభాలు తెచ్చిపెట్టాయో చూశాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో సినిమా నైజాం హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఆ సినిమా మరేదో కాదు. త్వరలో రిలీజ్ కాబోతున్న వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈవిషయాన్ని అధికారికంగా తెలియచేశారు.
Bringing the action from the skies to the big screens ✈️#OperationValentine – Nizam Release by @MythriOfficial 💥
In cinemas from MARCH 1st ❤️🔥#OPVonMarch1st@IAmVarunTej @ManushiChhillar @ShaktipsHada89 @MickeyJMeyer @sidhu_mudda @nandu_abbineni @sonypicsfilmsin… pic.twitter.com/DHWYAOHNXH
— Mythri Movie Makers (@MythriOfficial) February 25, 2024
కాగా ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























