టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. పండుగ బరిలో పలు స్టార్ హీరోల చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై అనూహ్యంగా సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.270 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రూ. 300 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Director @PrasanthVarma opens up about his ideas to cast @KChiruTweets & @urstrulyMahesh in #JaiHanuman 🔥#Chiranjeevi #MaheshBabu #TeluguFilmNagar pic.twitter.com/NSryuYApIf
— Telugu FilmNagar (@telugufilmnagar) January 30, 2024
కాగా ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రూపొందించనున్నట్లు ప్రశాంత్ వర్మ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఒక ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా భారతీయ ఇతిహాసాల్లోని గొప్ప గొప్ప పాత్రలను నేటి కాలానికి అనుగుణంగా చూపించాలని ఉందని అన్నారు. ఇక ‘జై హనుమాన్’ చిత్రంలో హనుమంతుడిగా మెగాస్టార్ చిరంజీవిని చూపించాలని ఉందని తెలిపారు. కాగా చిరంజీవి హనుమంతుడి భక్తుడు అన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన పలు సినిమాల్లో సందర్భోచితంగా డైలాగ్స్ చెప్పడం, సీన్స్‌లో నటించిన విషయం తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమే.
ఇక అవతార పురుషుడు శ్రీరాముడి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే చాలా బావుంటుందని అభిప్రాయపడ్డారు. శ్రీరాముడి గెటప్ లో మహేష్ బాబు పర్ ఫెక్ట్ గా సూట్ అవుతారని, ఇప్పటికే దీనికి సంబంధించి తన ఆఫీసులో గ్రాఫిక్స్ రూపంలో రాముడి గెటప్ లో మహేష్ రూపాన్ని తయారుచేశామని తెలిపారు. అయితే ఇది కేవలం తన ఆలోచన మాత్రమేనని స్పష్టం చేసిన ఆయన ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు అగ్ర హీరోల ముందుకు ఈ ప్రపోజల్ తీసుకెళ్లలేదని, భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ప్రశాంత్ వర్మ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఒకవేళ ఆయన చెప్పినట్లు ఇది నిజంగా కార్యరూపం దాల్చితే ‘జై హనుమాన్’ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: