ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. అయితే ఈసినిమా నుండి ఇప్పటివరకూ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అప్ డేట్ ను ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా ఫస్ట్ లుక్ ను జనవరి 28వ తేదీన 3 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కాగా ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Get ready to enter the intriguing world of #Gaami ❤🔥
Exclusive First Look Launch at Hyderabad Comic Con, Hitex Exhibition Centre on Jan 28th at 3:30 PM 🔥
Join Mass Ka Das @VishwakSenActor, @iChandiniC & team for the massive event 🔥
#KarthikSabareesh #VidyadharKagita… pic.twitter.com/0KWlNnmRqH— UV Creations (@UV_Creations) January 27, 2024
ఇంకా విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మార్చి 8వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈసినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి,సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























