రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ ఓటిటి లోకి వచ్చేసింది.నిన్న రాత్రి 12గంటలకు నెట్ ఫ్లిక్స్ ఈసినిమా తెలుగు తోపాటు తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక ఈసినిమాకు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఓటిటి లో అదే రెస్పాన్స్ వస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మిగితా వారు కూడా ఎలివేషన్ షాట్స్ ను స్క్రీన్ రికార్డింగ్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియా లో పెట్టేస్తున్నారు.ప్రభాస్ స్క్రీన్ ప్రెజన్స్,డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్ , రైటింగ్ రవి బస్రుర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే యాక్షన్ సీక్వెన్క్ సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ప్రభాస్ కు కావాల్సిన విజయాన్ని అందించింది.బాహుబలి 2 తరువాత మళ్ళీ ఆతరహా విజయం కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు సలార్ ఆ కోరికను తీర్చింది.ఫుల్ రన్ లో ఈసినిమా 625కోట్ల గ్రాస్ కు పైగా వసూళ్లను రాబట్టింది.నార్త్ అమెరికా లో అయితే మిలియన్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా మళయాలం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించాడు.ఇక ఫస్ట్ పార్ట్ బ్లాక్ బాస్టర్ కావడంతో సెకండ్ పార్ట్ శౌర్యంగ పర్వంపై అంచనాలు పెరిగిపోయాయి.త్వరలోనే ఈసినిమా గురించి అప్డేట్ రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























