మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ చేయగా అందులో భోళా శంకర్ బ్లాక్ బస్టర్ ను అందించగా.. భోళా శంకర్ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బింబిసార సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. విశ్వంభర అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇక ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ఏ రేంజ్లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో చూశాం. మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకొని టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇక ఈ రెస్పాన్స్ పై రామ్ చరణ్ తన ట్విట్టర్ పై స్పందిస్తూ.. కాన్సెప్ట్ వీడియో ఆసక్తిని రేకెత్తించింది.. చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ ను అందించారు.
#Vishwambhara concept teaser sparks anticipation, has piqued my interest.
Best wishes to the young director @DirVassishta, dearest @UV_Creations, and the reunion of Dad @KChiruTweets & @mmkeeravaani Garu’s musical brilliance is something I’m eagerly awaiting after many years.… pic.twitter.com/KPT0rHQEkG
— Ram Charan (@AlwaysRamCharan) January 17, 2024
కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. ఈసినిమాను వచ్చేే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























