నా సామిరంగ ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్

naa saami ranga movie trailer release date fixed

సంక్రాంతి బరిలో పలు సినిమాలు దిగనున్న సంగతి తెలిసిందే కదా. ఇక వాటిలో నాగార్జున నటించిన నా సామిరంగ సినిమా కూడా ఒకటి. చాలా సినిమాలు పోటీలో ఉన్నా ఏమాత్రం తగ్గేది లేదంటూ వచ్చేస్తున్నాడు నాగ్ కూడా. ప్రముుఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ గా వస్తుంది నా సామిరంగ. ఈసినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు అల్లరి న‌రేష్, రాజ్ తరుణ్ ఇంట్రో వీడియోలు పాటలు,టీజర్ రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. ఈనేపథ్యంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను అలానే టైమ్ ను ప్రకటించారు మేకర్స్. జనవరి9 వ తేదీన సాయంత్రం 3.15 నిమిషాలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరి సంక్రాంతి బరిలో పలు సినిమాలు ఉండగా ఈసినిమా ఏమేరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.