నా సామిరంగ టైటిల్ పెట్టడానికి కారణం అదే – డైరెక్టర్ విజయ్ బిన్ని

Naa Saami Ranga Director Vijay Binni Reveals Interesting Facts About Movie

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సామిరంగ సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు విజయ్ బిన్ని విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా ఎలా టర్న్ అయ్యారు?

దర్శకుడు కావాలనే పరిశ్రమలోకి వచ్చాను. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా చూసిన తర్వాత అన్నీ క్రాఫ్ట్స్ బాగా చేశారు, కొరియోగ్రాఫర్‌కి ఆ గ్రిప్ ఉంటుందని భావించి కొన్నాళ్ళు కొరియోగ్రఫీ వైపు వెళ్లాను.

మీ తొలి సినిమానే నాగార్జున గారు లాంటి పెద్ద స్టార్‌ని డైరెక్ట్ చేయడం కష్టం అనిపించిందా?

ఇంతకుముందు నాగార్జున గారికి పాటలు చేశాను. సినిమా కూడా చాలా హ్యాపీగా చేసుకుంటూ వెళ్లాం. దర్శకుడిగా తొలి సినిమాని నాగార్జున గారితో చేయడం నా అదృష్టం.

కొరియోగ్రఫీ వేరు డైరెక్షన్ వేరు కదా.. ఈ రెండు చేయడం ఒత్తిడి అనిపించిందా?

లేదండీ. నాకు మొదటి నుంచి డైరెక్షన్ పైనే ఆసక్తి వుంది. కొరియోగ్రఫీ కూడా ఎక్కువ స్టొరీ టెల్లింగ్ వున్న పాటలు, మాంటేజస్ చేశాను. సరైన సమయంలో ఈ అవకాశం వచ్చింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా అంతా సజావుగా జరిగింది.

ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?

ముందు నాగార్జున గారితో ఒక సినిమా చేయాలని ఆయనకి కథ చెప్పాను. అప్పుడు ఆయన ఈ కథ గురించి చెప్పి ఈ ప్రాజెక్ట్‌ని డైరెక్ట్ చేయమని చెప్పారు. అప్పుడు ఈ కథని ఓన్ చేసుకొని నా స్టయిల్‌లో చేశాను. ఈ సినిమాలో చాలా హైస్ వుంటాయి. వింటేజ్ నాగార్జున గారు కనిపిస్తారు. నేను నాగార్జున గారిని ఎంత డిఫరెంట్‍గా చూపించాలని అనుకున్నానో అంత కొత్తగా ప్రజెంట్ చేశానని భావిస్తున్నాను.

అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రల గురించి?

ఇదొక ఫ్రెండ్షిప్ మూవీ. నరేష్ గారికి నాగార్జున గారంటే పిచ్చి. వారిద్దరిని ఈ కథలో పెడితే బావుంటుందనిపించింది. నరేష్ గారు అద్భుతంగా చేశారు, వీరితో పాటు మరో యంగ్ యాక్టర్ వుండాలి. ఆ పాత్రకు రాజ్ తరుణ్‌ని తీసుకున్నాం. ఇందులో ముగ్గురికి ఒకొక్క కథ వుంటుంది. ఈ కథలు ఎలా కనెక్ట్ అయి వున్నాయి? వాళ్ళ మధ్య జరిగిన సిస్ట్యువేషన్స్ ఏమిటనేది చాలా కొత్తగా వుంటాయి.

మీ వర్క్ పట్ల నాగార్జున గారు ఎంత హ్యాపీగా వున్నారు?

నాగార్జున గారు చాలా హ్యాపీగా వున్నారు. ఆయన ఎంతో మంది దర్శకులతో పని చేశారు. అందులో నా ప్రత్యేకత ఎమిటనేది నాగార్జున గారు చెబితేనే బావుటుంది. ఆర్టిస్ట్ సపోర్ట్ చేస్తే సినిమాని ఎంత త్వరగా పూర్తి చేయొచ్చో ఈ సినిమాతో నేర్చుకున్నాను. నాగార్జున గారు, నరేష్ గారు రాజ్ తరుణ్ అద్భుతంగా సపోర్ట్ చేశారు.

ఇందులో ఐటెం సాంగ్ సర్‌ప్రైజ్‌ వుందని విన్నాం?

చాలా సర్‌ప్రైజ్‌లు వున్నాయి. అవన్నీ తెరపై చూడాల్సిందే (నవ్వుతూ).

ఆస్కార్ అవార్డ్ అందుకున్న తర్వాత కీరవాణి గారు చేసిన చిత్రమిది.. తొలి సినిమా దర్శకుడిగా ఆయనతో పని చేసిన మీ అనుభవం?

కీరవాణి గారు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడూ కొత్త దర్శకుడిలా చూడలేదు. నేను కోరియోగ్రఫర్‌ని కాబట్టి మ్యూజిక్ సెన్స్ వుంటుంది. ఆయనకి ఏదైనా చెప్పినా ఒక సెన్స్‌తోనే చెబుతుంటాడని భావించేవారు. ఆయన సపోర్టుని మర్చిపోలేను. ఇప్పటివరకూ వచ్చిన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. రాబోయే మూడు పాటలు కూడా వైరల్ అవుతాయి.

ఈ సినిమా నేపధ్యం ఏమిటి?

స్నేహం, మంచి ప్రేమకథ, చాలా మంచి ఎమోషన్ వుంటాయి. 80-90 మధ్య కాలంలో జరిగే కథ ఇది.

నా సామిరంగ టైటిల్ ఆలోచన ఎవరిది?

‘నా సామిరంగా’ ఏఎన్ఆర్ గారి సినిమాలో ప్రజాధరణ పొందిన పాట. అది టైటిల్ అయితే బావుంటుందని అందరం కలసి తీసుకున్న నిర్ణయం ఇది.

ఈ సినిమా కోసం చాలా ఫాస్ట్ గా పని చేశారు కదా.. ఎక్కడ ఒత్తిడి అనిపించలేదా?

డైరెక్టర్ కావడం నా డ్రీమ్. ఆ డ్రీమ్ కోసం చాలా కష్టపడ్డాను. సరైన సమయంలో ఈ చిత్రం వచ్చింది. దీనికి నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. కమర్షియల్ పంథాలోనే నా సొంత స్టైల్‌ని ప్రయత్నించాను. అది ఖచ్చితంగా యూనిక్‌గా వుంటుంది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది.

నిర్మాతల గురించి?

నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. కావాల్సిన ప్రతిది సమకూర్చారు. అందుకే ఇంత సజావుగా సినిమా జరిగింది.

ఇందులో కొరియోగ్రఫీ మీరే చేశారా?

నాలుగు పాటలకు నేను చేశాను. ఒక పాట విజయ్, మరో పాట దినేష్ మాస్టర్ చేశారు.

ఎలాంటి జోనర్ సినిమాలు చేయాలని అనుకుంటారు?

అన్ని జోనర్ సినిమాలు చేయాలని వుంది.

ఆల్ ది బెస్ట్..
థాంక్స్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్‌డ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.