షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నా సామిరంగ

Nagarjuna Akkineni’s Naa Saami Ranga Wrapped up The Entire Shoot

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు నృత్యాలను సమకూర్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, మిర్న మీనన్‌ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదల తేదీ దగ్గర పడుతున్నందున చిత్రబృందం సినిమాకు సంబంధించిన అన్ని పనులను త్వరితగతిన పూర్తిచేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‍ను పూర్తి చేసుకుంది. ఈ మేరకు చిత్రబృందం షూటింగ్ చివరిరోజున గుమ్మడికాయ కొడుతున్న వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన అన్ని ప్రచారచిత్రాలు నాగ్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ ని అలరించాయి.

కాగా ఈ సినిమాకు ‘నేను లోకల్‌’, ‘ధమాకా’ సినిమాలకు పని చేసిన ప్రసన్న కుమార్‌ బెజవాడ కథనందించగా.. ఆస్కార్ మరియు నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అయితే ఈసారి సంక్రాంతి బరిలో ‘నా సామిరంగ’తో పాటు మరికొన్ని అగ్రహీరోల భారీ బడ్జెట్ చిత్రాలు ఉండడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ సినిమా ఏమేరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.