అయలాన్ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన మేకర్స్

makers clarity on ayalaan movie release date again

తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కూడా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు తన నుండి విభిన్నమైన కథతో రాబోతున్నసినిమా అయలాన్. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో ఎలియన్ కథాంశంతో సైన్స్ ఫిక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను ఎప్పుడో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడంతో రిలీజ్ కూడా ఆలస్యమైంది. అయితే ఇటీవలే ఈసినిమాను పొంగల్ రేసులేకి దింపనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా రిలీజ్ డేట్ పై మళ్లీ పలు వార్తలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను చెప్పినట్టే జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.కెజెఆర్ స్టూడియోస్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.