బిగ్ బాస్7.. హౌస్ లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే రేస్ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే మంగళవారం మూడు టాస్క్ లను పెడతాడు బిగ్ బాస్. టిక్ టాక్ టిక్ అనే టాస్క్, పూలను సేకరించే టాస్క్ ను గాలం వేయ్ బుట్టలో పడేయ్ అనే టాస్క్ ను పెడతాడు బిగ్ బాస్. వీటిలో రెండు గేమ్స్ లో కూడా అర్జున్ గెలుస్తాడు. ఇక బుధవారం ఎపిసోడ్ లో కూడా పలు టాస్క్ లతో వచ్చేశాడు బిగ్ బాస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నాలుగో గేమ్ గా ఎత్తర జెండా టాస్క్ ను ఇస్తాడు బిగ్ బాస్. ఈ గేమ్ లో ప్రశాంత్, యావర్ మొదటి ఒకటి రెండు స్థానాల్లో గెలుస్తారు. ఆ తరువాత గెస్ చెయ్ గురూ అనే టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. ఒక సౌండ్ వస్తుంది దాన్ని బట్టి అదేంటో బోర్డ్ పై రాయాల్సి ఉంటుంది. ఇక ఈ గేమ్ లో కూడా అర్జున్ మొదటిస్థానంలో నిలుస్తాడు.
ఇక ఈ ఐదు గేమ్స్ ముగిసిన తరువాత ప్రియాంక లీస్ట్ స్కోర్ తో ఉండటంతో ఫినాలే రేస్ నుండి తప్పుకుంటుంది. అయితే గేమ్ నుండి ఔట్ అయిన వారు తమ పాయింట్లను వేరే వాళ్లకు ఇచ్చే అవకాళం ఇచ్చాడు బిగ్ బాస్. ఈనేపథ్యంలో ప్రియాంక దగ్గర ఉన్న 125 పాయింట్లను గౌతమ్ కు ఇచ్చేసింది. దీంతో గౌతమ్ కూడా రేస్ లోకి వచ్చింది.
అయితే ప్రియాంక తన దగ్గర ఉన్న పాయింట్లను గౌతమ్ కు ఇవ్వడంతో అమర్ అసహనం వ్యక్తం చేస్తాడు. నాకు ఇవ్వాలనిపించలేదా అంటూ అమర్ ప్రియాంక ను అడిగేస్తాడు. ప్రియాంక ఎంత నచ్చచెప్పుదామని చూసినా అమర్ వినిపించుకునే పరిస్థితిలో లేడు. ఆ తరువాత ప్రియాంక, గౌతమ్ దగ్గర తన బాధను చెప్పుకుంటుంది. వాళ్లు మాత్రమే గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి.. మేము చూపించుకోకూడదు అంటూ గౌతమ్ తో వాపోతుంది. ఆ తరవాత అమర్ దగ్గరకు వచ్చి క్షమించమని కూడా అడుగుతుంది ప్రియాంక. అయినా కూడా అమర్ ఏమాత్రం శాంతించడు. చూద్దాం మరి వీరి తగాదా ఎక్కడివరకూ వెళుతుందో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























