పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది. సీనియర్ నటి రాధిక కీలక పాత్రలో కనిపించనుండగా.. ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ‘ఆదికేశవ’ చిత్రం మరో రెండు రోజుల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Aadikeshava is certified with 𝐔/𝐀, Experience the 129 Minutes of Love, Laughter & Action-Packed entertainer on big screens near you!
Book your tickets now – https://t.co/T7GRgmcoX4#PanjaVaisshnavTej @sreeleela14 @gvprakash #SrikanthNReddy @vamsi84 #AadikeshavaOnNov24th pic.twitter.com/l7IPQ3svyy
— Vamsi Kaka (@vamsikaka) November 22, 2023
ఈ నేపథ్యంలో చిత్ర బృందం జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా నిన్న ‘ఆదికేశవ’ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా.. యూ ట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే..? ‘ఆదికేశవ’ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ కి సెన్సార్ బోర్డు 𝐔/𝐀 సర్టిఫికేట్ జారీ చేసింది. ఇక మూవీ టోటల్ రన్ టైమ్ 129 నిమిషాలుగా ఉండనుంది. ఈ మేరకు ‘ఆదికేశవ’ చిత్ర బృందం వెల్లడించింది. కాగా వైష్ణవ్ తేజ్, శ్రీలీల తొలిసారి జంటగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































