మంగళవారంకు సీక్వెల్ కూడా 

Mangalavaaram will have a sequel as well.

సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు సీక్వెల్స్ కామన్ అయిపోయాయి.రిజల్ట్ తో సంబంధం లేకుండా సీక్వెల్ కూడా ఉందంటూ ముందే చెప్పేస్తున్నారు.ఈ జాబితాలో మరో సినిమా చేరింది అదే మంగళవారం.ఆర్ ఎక్స్ 100ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన సినిమా ఇది.ఈవారం మంచి హైప్ తో విడుదలకానుంది.ఇక ఈసినిమాకు కూడా సీక్వెల్ ఉంటుందని అజయ్ భూపతి లేటెస్ట్ గా జరిగిన  ఇంటర్వ్యూలో చెప్పాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు మంగళవారం విజయం సాధించడం పక్కా అని ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.కంటెంట్ ను నమ్మి 20కోట్లు ఖర్చు పెట్టాం.సినిమా మంచి థ్రిల్ ఇస్తుంది.ముఖ్యంగా చివరి 40నిమిషాలు ట్విస్టులు ,సాంగ్  ప్రేక్షకులకు గూస్ బంబ్స్ తెప్పిస్తాయి అంటూ చెప్పొకొచ్చాడు.అలాగే ఎలాంటి వల్గర్ సన్నివేశాలు లేకుండా సినిమా ఉంటుందని అన్నాడు.

పోస్టర్లు, ట్రైలర్.. సినిమా చూడాలి అనే ఆసక్తిని క్రీయేట్ చేయగలిగాయి.ఈసినిమా మీద వున్న నమ్మకంతో రిలీజ్ కు ముందు రోజు పెయిడ్ ప్రీమియర్లు వేయాలని మేకర్స్ భావిస్తున్నారట.మంగళవారం లో పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ గా నటించగా అజయ్ ఘోష్,నందిత శ్వేతా,దివ్యా పిళ్ళై కీలక పాత్రల్లో కనిపించనున్నారు.కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.ముద్ర మీడియా వర్క్స్,ఏ క్రీయేటివ్ వర్క్స్ నిర్మించాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.