యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ సింహాద్రి తనను సినిమాలవైపు మళ్లేలా చేసిందని హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ తెలిపాడు.న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈసినిమాతో శౌర్యువ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా డిసెంబర్ 8న విడుదలకానుంది.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ తో బిజీ గా వుంది.అందులో భాగంగా ఇంటర్వ్యూ లో పాల్గొంటున్నారు.తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శౌర్యవ్ ను డైరెక్టర్ గా మారడానికి ఎక్కువ ప్రభావం చూపిన సినిమా ఏదని అడుగగా దానికి అతను సింహాద్రి అంటూ చెప్పుకొచ్చాడు.అలాగే హాయ్ నాన్న మంచి విజయం సాధిస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు ఈ డైరెక్టర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో హాయ్ నాన్న ఫై అంచనాలు పెరిగిపోయాయి.బ్యూటిఫుల్ లవ్ &ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా బేబీ కైరా ఖన్నా నాని కూతురిగా నటించింది.ఖుషి ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఈసినిమా తెలుగు తోపాటు ఇతర భాషల్లోకూడా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























