తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కోట బొమ్మాళి పీఎస్. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమాకు రీమేక్ గా వస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. నవంబర్ 24వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ అయితే ఆద్యంతం థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంది. పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఎలా ఉంటుంది అనేది టీజర్ లో చూపించారు.
కాగా ఈసినిమాలో ఇంకా రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ మరియు విద్యా కొప్పినీడి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు రాజ్ మరియు మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























