లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా 1987 లో వచ్చిన నాయకుడు సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఈసినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. అయితే ఇప్పుడు దాదాపు 36ఏళ్ల తరువా మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. క్లాసిక్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. ఈమధ్యనే సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రేపు కమల్ పుట్టిన రోజు సందర్బంగా ఈసినిమాకు నుండి వరుసగా అప్ డేట్లు వస్తున్నాయి. ఇప్పటికే టైటిల్ ను ప్రకటించారు. థగ్ లైఫ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు ఈసినిమాకు. దీనితోపాటు ఈసినిమాలో నటిస్తున్న కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, స్టార్ హీరోయిన్ త్రిష, తమిళ్ స్టార్ జయం రవి ఈసినిమాలో నటిస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటిస్తూ పోస్టర్లను రిలీజ్ చేశారు.
His energy & fervour light up the screens! It is always OKK to work with @dulQuer 😃
Happy to have you aboard #KH234 ✨#TitleAnnouncementToday5pm#Ulaganayagan #KamalHaasan #CelebrationBeginsNov7 #HBDUlaganayagan #HBDKamalSir@ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran… pic.twitter.com/QpbF0UDCrM
— Red Giant Movies (@RedGiantMovies_) November 6, 2023
Welcoming the ravishing and versatile @trishtrashers to the exciting journey of #KH234 #TitleAnnouncementToday5pm #KH234 #Ulaganayagan #KamalHaasan #HBDKamalSir #HBDUlaganayagan@ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @dulQuer @MShenbagamoort3 @RKFI… pic.twitter.com/ga93eFfBWA
— Red Giant Movies (@RedGiantMovies_) November 6, 2023
We’re beyond excited to announce our collaboration with @actor_jayamravi on this awe-inspiring journey…#TitleAnnouncementToday5pm #KH234 #Ulaganayagan #KamalHaasan #HBDKamalSir #HBDUlaganayagan@ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @trishtrashers @dulQuer… pic.twitter.com/ycIykUzFd6
— Red Giant Movies (@RedGiantMovies_) November 6, 2023
కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా..మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా కమల్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రవి కె చంద్రన్.. ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























