మా ఊరి పొలిమేర 2 ప్రేక్షకులకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది – సత్యం రాజేష్

Satyam Rajesh Says, Ma Oori Polimera-2 Will Give Goosebumps to The Audience

‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’ డా.అనిల్ విశ్వనాథ్. ద‌ర్శ‌కుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ముఖ్యతారలుగా నటిస్తున్న ఈ చిత్రంలో గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్‌పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈరోజు (నవంబర్ 3, 2023) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు సత్యం రాజేష్ పాత్రికేయులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ‘మా ఊరి పొలిమేర 2’ చిత్రం గురించి పలు విశేషాలను వివరించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘మా ఊరి పొలిమేర 2’ చిత్రం గురించి సత్యం రాజేష్ చెప్పిన విశేషాలు..

  • నవంబర్ 3న ఈ సినిమా విడుదలవుతోంది. పార్ట్ 1 చూసిన ఆడియన్స్ మా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
  • మా సినిమాకు ప్రత్యేకమైన ఆడియన్స్ వున్నారు. మాకు అదే ధైర్యం.
  • మొదటి భాగంతో పొల్చితే రెండవభాగం మేకింగ్ పరంగా రిచ్ గా వుంటుంది.
  • తొలి భాగాన్ని మాకు వున్న బడ్జెట్ పరంగా అంతేవరకే చూపించాం. చాలా తక్కువ వర్కింగ్ డేస్ లో పూర్తిచేశాం.
  • కానీ రెండోభాగం ప్రారంభానికి ముందే దీనిని చాలా ఖర్చుతో అనుకున్న లోకేషన్స్ ల్లో ఖర్చుకు వెనుకాడకుండా రిచ్ గా, క్వాలిటీ మేకింగ్ లో చిత్రీకరణ చేశాం.
  • మొదటిపార్ట్ చిత్రీకరణ అప్పుడే పార్ట్ 2 వుందని అనుకున్నాం.
  • కానీ పార్ట్ 1కు వచ్చిన స్పందనను బట్టి చేద్దాం అనుకున్నాం.
  • సో పార్ట్ 1కు అనూహ్య స్పందన రావడంతో ధైర్యంగా పార్ట్ 2 మొదలుపెట్టాం.
  • పొలిమేర లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది.
  • అయితే నేను మొదట్నుంచీ కూడా కొత్త పాత్రలు చేయాలని అనుకునే వాడిని.
  • ఆ తరహా లోనే నా సినిమాల ఎంపికలు వుండేవి. నటుడిగా ప్రూవ్ చేసే ఎలాంటి పాత్రలు చేయడానికి కైనా రెడీగా వుండేావాడిని.
  • రెండో భాగంలో తప్పకుండా మిమ్ములను షాకింగ్ కు గురిచేసే ట్విస్టులు వుంటాయి. అవి మీకు సర్ ప్రైజింగ్ గా అనిపిస్తాయి.
  • మొదటి పార్ట్ చూడకపోయినా రెండో పార్ట్ అర్థం అవుతుంది.
  • దర్శకుడు కథను అలాగే రాసుకున్నాడు. పార్ట్ 1 చూడనివాళ్లకు అర్థమయ్యేలా రెండోభాగం ప్రారంభంలో రీక్యాప్ వేస్తున్నాం.
  • పార్ట్ 1 చూస్తే ఈ సినిమాను మరింత బాగా ఎంజాయ్ చేస్తారు, చూడకపోయినా పార్ట్ 2నచ్చుతుంది.
  • పార్ట్ 1 షూటింగ్ చేస్తున్నప్పుడు భయపడ్డాను. ఫారెస్ట్ లో, రాత్రి పూట శ్మశానంలో చేతబడుల సన్నివేశాలకు భయపడ్డాను.
  • ఈ సినిమాల్లో సన్నివేశాల డిమాండ్ మేరకు నేను న్యూడ్ గా కనిపిస్తాను.
  • ఏదైనా సినిమా కోసమే, ఇలాంటి అరుదైన అవకాశం అందరికి రాదు.
  • రియల్ లైఫ్ లో నాకు తెలిసి చేతబడులు చేసిన వాళ్లు ఎవరూ మనకు తారసపడరు.
  • అందుకే ఈ పాత్ర కోసమే ఈ విషయాలు తెలుసుకుని నటించాను.
  • మా సినిమా అంతే భయంకరంగా వుంటుంది. చాలా ఒళ్లు గగుర్పొడించే సన్నివేశాలు వుంటాయి.
  • పొలిమేర 3 కూడా ఉంటుంది. ఒకే కథ కాబట్టి నాకు తెలిసి పొలిమేర 3 లో కూడా నేనే వుంటాను.
  • నేను హీరోని కాదు. కేవలం ఆర్టిస్ట్ ని మాత్రమే. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలనేది నా తపన.
  • కేవలం హీరోగానే చేస్తానని అనడం లేదు. చిన్న కాన్సెప్ట్లతో వచ్చిన సినిమాల్లో లీడ్ పాత్రలు చేస్తాను.
  • ఈ చిత్ర నిర్మాత గౌరిక్రిష్ణ ఎక్కడ రాజీపడకుండా ఖర్చు పెట్టి సినిమాను నిర్మించాడు.
  • అయితే ఈ సినిమాను వంశీ నందిపాటి విడుదల చేయడంతో సినిమాకు రెక్కలు వచ్చినట్లు అనిపించింది.
  • వంశీ ఈ సినిమాను భారీ సినిమాలా ప్రమోషన్ చేసి సినిమాను విడుదల చేస్తున్నాడు.
  • ఈ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకుందామని అనుకుంటున్నాను.
  • నా లైఫ్ లో పొలిమేర 2 పెద్ద విషయం. మళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో తెలియదు.
  • గీతాంజలి , బాలకృష్ణ గారి సినిమా, మట్కా చిత్రాల్లో పెద్ద పాత్రలు చేస్తున్నాను.
  • టెరెంట్ అనే సినిమాలో నేను లీడ్ రోల్ గా చేస్తున్నాను. నా కెరీర్ లో టెరెంట్ కూడా గొప్ప సినిమా అవుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.