ఆదికేశవ- వరల్డ్ కప్ ఎఫెక్ట్.. మళ్లీ మారిన రిలీజ్ డేట్

aadikeshava movie release date postponed again

శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆదికేశవ. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రుద్ర కాళేశ్వర్ రెడ్డి అనే పాత్రలో వైష్ణవ్ తేజ్ కనిపించనున్నాడు. మొదటిసారి ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నాడు వైష్ణవ్ తేజ్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సిత్తరాల సిత్రాంగి, లీలమ్మో అంటూ రెండు పాటలను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారింది. ఈసినిమాను ముందు ఆగష్ట్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ షూటింగ్ లేట్ అవ్వడంతో నవంబర్ కు మారింది. నవంబర్ 10వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఈమధ్యే తెలిపారు. అయితే ఇప్పుడు మళ్లీ ఈసినిమా రిలీజ్ డేట్ ను మార్చారు మేకర్స్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈసినిమా నిర్మాత నాగవంశీ రిలీజ్ డేట్ గురించి చెబుతూ ఈసినిమా రిలీజ్ డేట్ ను నవంబర్ 10 వ తేదీ నుండి నవంబర్ 24వ తేదీకి మార్చుతున్నట్టు తెలిపాడు. వరల్జ్ కప్ సీజన్ వల్ల రిలీజ్ డేట్ ను మార్చుతున్నట్టు తెలిపారు. ఈనేపథ్యంలో దీనిపై తాజాగా అధికారికంగా కూడా ప్రకటించారు.

కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. అపర్ణా దాస్‌ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.