పెళ్లిచూపులు కాంబో రిపీట్.. త్వరలో తరుణ్ భాస్కర్‌తో విజయ్ దేవరకొండ సినిమా

Vijay Deverakonda Announces His Movie with Director Tharun Bhascker

‘పెళ్లి చూపులు’ కాంబో రిపీట్ కాబోతోంది. టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మరియు ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ కలయికలో త్వరలో కొత్త సినిమా రూపొందనుంది. ఈ మేరకు హీరో విజయ్ దేవరకొండ స్వయంగా వెల్లడించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరైన ‘కీడా కోలా’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో భాగంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. కాగా ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్‌ దాస్యం నుంచి వస్తున్న మూడవ చిత్రం ‘కీడా కోలా’. క్రైం కామెడీ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్‌ హాస్య నటుడు బ్రహ్మానందం ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. త‌రుణ్ భాస్కర్‌, చైత‌న్య రావు, రవీంద్ర విజయ్‌, హరికాంత్, రఘురామ్‌ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం (డిసెంబర్ 29, 2023) హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ” ‘కీడా కోలా నవంబర్ 3న మీ ముందుకు వస్తోంది. నన్ను హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. అందుకే ఈ రోజు ఇక్కడకు వచ్చాను. నాకు హిట్ సినిమాలు ఇచ్చిన ‘నాగ్ అశ్విన్’, ‘సందీప్ రెడ్డి వంగా‘, ‘తరుణ్ భాస్కర్’ వీరెవరూ ఇంతకుముందు నాకు తెలియదు. అందరం ఎక్కడెక్కడో చదువుకుని ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చాక అనుకోకుండా కలిశాం. మొదట ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో నాగీ నన్ను పెట్టుకున్నాడు. అందులో నన్ను చూసిన తరుణ్ ‘పెళ్లి చూపులు’లో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీకందరికీ తెలుసు. ఆ చిత్రం తరుణ్ భాస్కర్‌కు జాతీయ అవార్డు కూడా తెచ్చి పెట్టింది” అని తెలిపారు.

ఇంకా ఆయన ఇలా చెప్పారు..”అయితే ‘పెళ్లి చూపులు’ చేసి ఏడేళ్లు అవుతోంది. అప్పుడప్పుడు నాతో సినిమా చేయ్.. ఏదైనా స్టోరీ ఉంటే చెప్పు అని తనని అడుగుతూనే ఉంటాను. ఈ క్రమంలో ఇటీవలే ఒక స్క్రిప్ట్‌ చెప్పగా అది చాలా నచ్చింది, అందుకే వెంటనే దానిని లాక్ చేసేసాం. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం” అని అన్నారు. ఇక తనకు ఎంతో ఆప్తుడైన తరుణ్ భాస్కర్ చేసిన ‘కీడా కోలా’ సూపర్ హిట్ అవుతుందని విజయ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే విజయ్, తరుణ్ భాస్కర్‌లు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన ‘పెళ్లి చూపులు’తో ఇరువురూ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనకు హీరోగా ఛాన్స్ ఇచ్చిన తరుణ్ భాస్కర్‌ను హీరోగా పెట్టి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు విజయ్ దేవరకొండ.

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సారథ్యంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ‘ఫ్యామిలీ స్టార్’ అనే చిత్రం చేస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందుతోంది. సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌ దేవరకొండ, పరశురాం కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై ఆడియెన్స్‌లో ఇప్పటికే మంచి బజ్‌ ఏర్పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా  రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ‘సీతారామం’ ఫేమ్ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంది.

కాగా ‘కీడా కోలా’ సినిమాలో త‌రుణ్ భాస్కర్‌, చైత‌న్య రావు, రవీంద్ర విజయ్‌, హరికాంత్, రఘురామ్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక త‌రుణ్ భాస్కర్‌కి దర్శకుడిగా ఇది తొలి పాన్ ఇండియా సినిమా కావ‌డం విశేషం. ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఉపేంద్ర వర్మ ఎడిటర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వీజీ సైన్మా బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో రానా ద‌గ్గుబాటి సమర్పణలో ‘కీడా కోలా’ నవంబర్ 3వ తేదీన తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌ మరియు హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.