ఆకాశం దాటి వస్తావా- శృంగార సాంగ్ రిలీజ్

Srungara song out from Aakasam Dhaati Vasthaava movie

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పటికే శ్రీ వెంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే చిన్న సినిమాలను, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో దిల్ రాజు ప్రొడక్షన్స్ అంటూ మరో బ్యానర్ పెట్టి ఆ బ్యానర్ లో సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న మరో సినిమా ఆకాశం దాటి వస్తావా. శశికుమార్ ముత్తులూరి దర్శకత్వంలో కొరియోగ్రాఫర్ యశ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఆకాశం దాటి వస్తావా. మ్యూజికల్ లవ్ స్టోరీగా ఈసినిమా రాబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే ఒకపాటను రిలీజ్ చేయగా ఇప్పుడు శృంగార అంటూ వచ్చే సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇకఈపాట హీరో, హీరోయిన్స్ మధ్య సాగే రొమాంటిక్ డ్యూయెట్ లా కనిపిస్తుంది.

కాగా ఈసినిమాలో కార్తీక మురళీధరన్ హీరోయిన్ గా నటిస్తుంది. సింగర్ కార్తీక్ ఈ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.