వరుణ్ సందేశ్ ‘చిత్రం చూడర’ టీజర్‌ లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్

Producer TG Viswa Prasad Launches Varun Sandesh's Chitram Chudara Movie Teaser

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘చిత్రం చూడర’. ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో శీతల్ భట్ కథానాయికగా నటిస్తోంది. బిఎమ్ సినిమాస్ బ్యానర్‌పై శేషు మారం రెడ్డి, బోయపాటి బాగ్యలక్ష్మి నిర్మిస్తున్నారు. కాగా అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ధన తుమ్మల సహ నిర్మాత. త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలయికలో వచ్చిన ‘బ్రో’తో టాలీవుడ్‌కు హిట్ సినిమా అందించిన స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టీజర్ ప్రారంభంలో ఒక ఇంటి గోడపై వరుణ్ సందేశ్, ధనరాజ్, కాశీ విశ్వనాథ్‌లు కూర్చుని కనిపించారు. అయితే వారు ముగ్గురు సస్పెన్స్ ఫేస్‌లతో కనిపించడంతో ఏమై ఉంటుందా? అని ఆసక్తి కలుగుతుంది. కాగా ఇందులో వరుణ్ సందేశ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానిగా కనిపించడం విశేషం. ఇక స్టోరీ ప్రకారం, వరుణ్ సందేశ్ క్రైమ్‌లో ధన్‌రాజ్, కాశీ విశ్వనాథ్ ఇద్దరూ భాగస్వాములుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే టీజర్‌లో ఎక్కడా మెయిన్ కోర్ పాయింట్‌ను రివిల్ చేయకుండా.. సస్పెన్స్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకునేలా కట్ చేశారు. మొత్తానికి ఈ టీజర్ ‘చిత్రం చూడర’ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు.

ఇక ఈ చిత్రంలో ప్రముఖ దర్శక, నటుడు అల్లరి’ రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీరాజా, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషించారు. అలాగే రచ్చ రవి, కెఎ పాల్ రాము, పింగ్ పాంగ్ సూర్య, రైజింగ్ రాజు తదితరులు నటించారు. వీరితోపాటుగా ‘నేనింతే’ ఫేమ్ అదితి గౌతమ్ ఓ ప్రత్యేక పాత్రలో (స్పెషల్ అప్పిరియన్స్) అలరించనుంది. టాలెంటెడ్ కంపోజర్ రధన్ సంగీతం అందిస్తుండగా, జవహర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయేషా మరియం కాస్ట్యూమ్స్ సమకూర్చగా.. రఘు మాస్టర్, చిట్టి మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఆర్ట్ డైరెక్టర్‌గా రవి కుమార్ గుర్రం, స్టంట్స్ డైరెక్టర్‌గా రియల్ సతీష్.. అలాగే రామజోగయ్య శాస్త్రి, కిట్టు విస్సాప్రగడ, రాంబాబు గోసాల సాహిత్యం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.