టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను అందించారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Get ready for a blast of #Extra-Entertainment in just 4 days! 🤩🔥#ExtraTeaser On October 30th #ExtraOrdinaryManOnDec8th@actor_nithiin #Rajasekhar @sreeleela14 @vamsivakkantham@Jharrisjayaraj #SudhakarReddy #NikhithaReddy @SreshthMovies@vamsikaka @adityamusic pic.twitter.com/5OU7d3KjjD
— Sreshth Movies (@SreshthMovies) October 26, 2023
ఇక ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా టీజర్‌ను ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్.. తాజాగా దీనిని మరోసారి ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో హీరో నితిన్ కి సంబంధించి ఒక కొత్త పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ చూస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘తమ్ముడు’ సినిమా గుర్తుకొస్తోంది. ఎందుకంటే.. ఇందులో నితిన్, ‘తమ్ముడు’లోని ‘వయ్యారి భామ.. నీ హంస నడక’ సాంగ్‌లో పవన్ కళ్యాణ్ సిగ్నేచర్ గెటప్‌లో కనిపించాడు. అందులో మాదిరే నితిన్ కూడా కూలీగా పైన రెడ్ షర్ట్, కింద గళ్ళ లుంగీ ధరించి చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. కాగా నితిన్, పవర్ స్టార్ ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































