నందమూరి కళ్యాణ్ రామ్.. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో. ఈయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే మరో ప్రధాన పాత్రలో మాళవికా నాయర్ కనిపించనుంది. కాగా ‘డెవిల్’ సినిమాను నవంబర్ త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘డెవిల్’ చిత్రంలో పవర్ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తోన్న హీరోయిన్ మాళవికా నాయర్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆదివారం మేకర్స్ మాళవికా నాయర్ లుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ట్రెండింగ్ అవుతోంది. మణిమేకల పాత్రలో మాళవికా నాయర్ కనిపించనున్నారు. ఆమె లుక్ పోస్టర్‌ను గమనిస్తే.. డిఫరెంట్ హెయిర్ స్టైల్లో కనిపిస్తున్నారు. మైకు ముందు నిలబడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లు ఉంది. అయితే ఆమె పాత్రకు ఈ సినిమాకు కథకు ఉన్న లింకేంటనేది తెలుసుకోవాలంటే మాత్రం నవంబర్ 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానున్న సినిమాను చూడాల్సిందేనంటున్నారు నిర్మాతలు.
‘డెవిల్’ చిత్రంలో ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఆయన ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నందమూరి కళ్యాణ్ రామ్ ఆకట్టుకోబోతున్నారు. గత ఏడాది తెలుగు సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన ‘బింబిసార’తో మెప్పించిన ఆయన ఈ ఏడాది ‘డెవిల్’తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. ఇక దేవాన్ష్ నామా సమర్పకుడిగా.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే, కథను అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత సారథ్యం వహిస్తుండగా సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. కాగా ‘డెవిల్’ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























