ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం డీజే టిల్లూ సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈసినిమాతో పాటు బొమ్మరిల్లు భాస్కర్ తో కూడా మరో సినిమా చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. మరో సినిమా కూడా సిద్దు లైనప్ లో ఉంది. నీరజ కోన దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటివరకూ స్టైలిష్ గా పనిచేసిన నీరజ ఈసినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతుంది. ఇక ఈసినిమా టైటిల్ ను నేడు ప్రకటించారు మేకర్స్. ఈనేపథ్యంలో ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తూ అందులో వినూత్నంగా ఈసినిమా టైటిల్ ను అలానే ఈసినిమాలో నటిస్తున్న క్యాస్ట్ అండ్ క్రూ కి సంబంధించిన వివరాలు తెలియచేశారు. తెలుసు కదా అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు.
కాగా ఈసినిమాలో రాశీ ఖన్నా, నిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ను త్వరలో స్టార్ట్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























