టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో తరుణ్ భాస్కర్ దాస్యం ఒకరు. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సూపర్ హిట్ సినిమాలతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం ‘కీడా కోలా’. క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. రవీంద్ర విజయ్, హరికాంత్, రఘురామ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా తరుణ్ భాస్కర్‌కి ఇది తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. అయితే ఇప్పటికే ఈ సినిమాలోని బ్రహ్మానందం పాత్రకి సంబంధించిన లుక్‌ను విడుదల చేయగా, సోషల్ మీడియాలో మంచి అప్లాజ్ వచ్చింది. బ్రహ్మీ ఇందులో వరదరాజులు (తాత) పాత్రలో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఒక కీలక అప్‌డేట్ అందించారు మేకర్స్. అక్టోబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా దీనికి సంబంధించి వివరాలు తెలియజేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. కాగా వీజీ సైన్మా బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కుతోన్న ఈ ‘కీడా కోలా’ చిత్రాన్ని కే వివేక్ సుధాన్షు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఏజే ఆరాన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఉపేంద్ర వర్మ ఎడిటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























