నాచురల్ స్టార్ నాని,సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న.రీసెంట్ గా విడుదలైన గ్లింప్స్,సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.ముఖ్యంగా సంగీతం సినిమాకు ఫ్రెష్ ఫీల్ తెప్పించింది.ఇక ఈసినిమా టీజర్ ను కొద్దీ సేపటి క్రితం విడుదలయింది.టీజర్ ను కూడా బాగా కట్ చేశారు.టీజర్ చూస్తే హాయ్ నాన్న ఓ బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ మూవీ అయ్యేలా కనిపిస్తుంది.తండ్రి, కూతరుకు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా తో తెరకెక్కుతుంది ఈ సినిమా.టీజర్ లో నాని లుక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అయ్యాయి.ఇక టీజర్ లో హాయ్ నాన్న రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.ముందుగా అనుకున్నడేట్ ప్రకారం అయితే డిసెంబర్ 21 విడుదలకావాల్సి ఉండగా సరిగ్గా అదేనెల 22న ప్రభాస్ సలార్ వస్తుండడంతో హాయ్ నాన్న ముందుకు జరిగింది.డిసెంబర్ 7న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Presenting the most enthralling and affectionate #HiNannaTeaser ❤️🔥
Love will blossom soon in Cinemas Worldwide on December 7th, 2023 🔥#HiNanna
Natural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998… pic.twitter.com/tgJemf1J39
— Vyra Entertainments (@VyraEnts) October 15, 2023
ఓవరాల్ గా టీజర్ సినిమాకు కావాల్సిన హైప్ ఇచ్చింది.కొత్త డైరెక్టర్ శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్లా వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.హాయ్ నాన్న తెలుగు తోపాటు హిందీ,కన్నడ,మలయాళ,తమిళ భాషల్లో విడుదలకానుంది.
ఇక అంటే సుందరానికి తరువాత దసరా తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చాడు నాని.ఈఏడాది సమ్మర్ లో వచ్చిన ఈసినిమా 100కోట్లను రాబట్టింది.మరి ఈ ఏడాది మరోసారి బాక్సాఫీస్ మీదకు దండయాత్రకు వస్తున్న నాని దసరా మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: